నూతన సంవత్సర శుభాకాంక్షలు



నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ నూతన సంవత్సరంలో మీకు అన్ని రకాలుగా శుభం కలిగి, మీ ప్రతీ పనిలోనూ జయకేతనం ఎగరేయాలి అని కోరుకుంటూ, ముందు ముందు మీరు చేసే ప్రతీ పనిలో కూడా విజయం మిమ్మల్ని వరించాలి అని కోరుకుంటున్నను!!

WISH U
A
HAPPY AND PROSPEROUS
NEW YEAR
2007




Image Courtesy : http://www.india.gov.in


Test Post !!

 

 

 

I have just downloaded the Windows Live Writer and testing the Smiley options and Telugu display options

 

 

smile_nerdsmile_speedysmile_regular

 

 

అందరూ మహానుభావులే !!
అందరికీ వందనములు !!

 

తిండి తిప్పలు !!!

ఈ రోజు నాకు కొత్త అనుభవం ఎదురయ్యింది !!
సరదాగా కూడా ఉంది !!

ఈ రోజు రూంలో ఒక్కడినే ఉన్నాను ! అందుకని అన్నము వండుకోడానికి బద్దకం వేసి, సరదా(తీరే దాకా)గా బయట తిందామని అనుకున్నా !!

వెంటనే బయలుదేరాను !!

రోడ్డు మీదకి వెళ్ళాను, దగ్గర్లో ఒక్క రెస్టారెంటు కూడా లేదు.... కొంత దూరం నడవగానే "DOMINOS PIZAA" కనిపించింది !!
లోపలికి వెళ్ళీ "May I have a thin crust, single topping, medium sized Jalapènos Pizaa please !!" అని ఏదో పద్యం అప్పచెప్పినట్టు ఫాస్టు గా చదివేశా (మన ఎంగిలిపీసు ప్రావీణ్యం చూపిద్దామని) !!

కష్టపడి అంత ఫాస్టుగా చెప్పాకా, అక్కడ ఉన్న అమ్మాయి , "I am sorry !! Pardon me, I didnot understand wat u said !" అంది !!

నా తల్లే ! ఎమీ అర్ధం కాలేదా ! అనుకున్నా మనసులో...
ఇందాక చెప్పినదే మళ్ళీ , ఒక్కో పదం విడమర్చి, వివరించి చెప్పాను !!

అర్డరు చేయడం అయిపోయింది !! కానీ నేను అక్కడ గమనించింది ఏంటి అంటే, పిజ్జాని ఇంటికి తీసుకుపోయి తినాలి, అక్కడ కూర్చుని తినడానికి వీలు లేదు !
ఓరి భగవంతుడా ! మళ్ళీ ఇంటి దాకా నడుచుకుంటూ వెళ్ళాలా.... నాకు అంత ఓపిక లేదు....
ఇక్కడే ఏ చెట్టు కిందన్నా కూర్చుని తిందాములే అనుకుని పిజ్జా తీసుకుని బయటకు వచ్చాను !!

బయటకు రాగానే మంచి ఆలోచన వచ్చింది !!
పక్క రెస్టారెంటులో ఖాళీగా కుర్చీలూ బల్లలూ కనిపిస్తున్నాయి , అక్కడికి వెళ్ళి కూర్చుని తింటే పోతుంది కదా అని !!

భలే ఉంది కదా ఆలోచన !!

కాని అక్కడెక్కడో కొనుక్కుని వచ్చి, వాడి టేబుల్ మీద కూర్చుని తింటే , ఆ రెస్టారెంటు వాడు ఎందుకు ఒప్పుకుంటాడు ?
అందుకని అక్కడ ఎమన్నా కొంటే అదీ ఇదీ రెండూ కలిపి అక్కడే తినచ్చు కదా అనుకున్నా... !!
కానీ ఏమి తినాలి ?
నేను బయటకు వస్తే తినేవి, పిజ్జా, Potato Fries (I am a vegetarian)!!
కాబట్టి అదే తినాలి !
నాకు అక్కడ కనిపించిన రెస్టారెంటు పేరు "WAFFLE HOUSE"...
అక్కడికి వెళ్ళి అడిగాను.... "May I have small sized french fries please" అని !!
అక్కడ ఉన్న అమ్మాయి "what sis u say ?" అంది !!
ఈ సారి నేను ఏమి అంత ఫాస్టుగా చెప్పలేదే....
మళ్ళీ మళ్ళీ చెప్పాను "french fires", "potato fries" అని...
అక్కడ అలాంటివి ఏమి లేవు అని చెప్పి , ఒక ఉచిత సలహా పడేసింది నాకు !!
"They will be available in the Chinese restaurant" అని పక్కనే ఉన్న ఒక చైనీసు రెస్టారెంటు చూపించింది !!

నాకు అప్పటికీ అనుమానం గానే ఉంది..
"Chinese restaurant" లో "French fries" ఏంటా అని!!
సరే ఒక రాయి వేస్తేపోలా అని వెళ్ళాను !!
అక్కడికి వెళ్ళి అదే అడిగాను !!
అక్కడ ఉన్న అమ్మాయికి ఇంగ్లీషు రాదు , నాకు చైనీసు రాదు !!
ఇంక చూడాలి మా ఫార్సు !!

మొత్తానికి అక్కడ అలాంటివి ఏమీ లేవు అని అర్థమ అయిపోయింది !!

మొహము మీద రాని నవ్వు ఒకటి తెప్పించుకుని "OK ! Thank you ! Have a nice day !" అని చెప్పి బయట పడ్డాను !!

తలుపు తీసిన వెంటనే , ఎడారిలో ఎండమావిలాగా, కళ్ళముందు "McDonald's Restaurant" !!
అది French fries కి పెట్టింది పేరు !!
వెళ్ళి చిన్న french fries ఒక చిన్న sprite ఆర్డరు చేసాను !!
ఆర్డరు చెప్తున్నంతసేపూ ఆ కౌంటరులో ఉన్న అమ్మాయి చూపు నా చేతిలో ఉన్న పిజ్జా మీదే !!

మొత్తానికి ఆర్డరు వచ్చింది !!

వెళ్ళి కూర్చుని పిజ్జా పార్సెలు తెరిచి లాగిస్తున్నా !!
అక్కడ పనిచేస్తున్న మనుషులు నన్ను వింతగా చూస్తున్నారు ! వీడికి ఈ పిజ్జా తినటానికి ఇన్కా వేరే చోటు దొరకలేద అన్నట్టూ ( అది నా Psychological feeling కూడా కావచ్చు !!)
మొత్తానికి అన్నీ లాగించేసాను !!


తాపీగా బయటకు వచ్చి... రూము వైపు ఆడుగులో అడుగు వేస్తూ నడవసగాను !!

అమెరికా వచ్చి నాలుగు నెలలు ఉండి అలవాటు పడిన నాకే ఇంత కష్టంగా ఉంటే ! అప్పుడె ఫ్లైటు దిగిన వాళ్ళ పరీస్థితి ఏంటి ??
(కొంచెము ఎక్కువైంది కదా !!)

కోటి రూపాయలు !!

చికాగో లోని వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఒక ప్రవాస భారతీయుడు కోటి రూపాయలు ఖర్చుపెట్టి కిరీటం చేయిస్తున్నాడట !!

ఇదిగో ఆ వార్తని ఇక్కడ చూడండి !!


అసలు విషయానికి వస్తున్నా !!

ముందు ఇది చదవగానే నాకు అనిపించింది ఏంటి అంటే, ఆ కిరీటానికి ఖర్చు పెట్టే డబ్బుల్లో సగమైనా చారిటీ కింద ఏ పేద వాళ్ళకో దానము చెయ్యచ్చు కదా అని !!



కాకపోతే ఆయన అలాంటి చారిటీ పనులు కూడా చేస్తున్నాడో లేదో నాకు తెలీదు... ఏదో మనసుకి అనిపించింది ఇక్కడ రశాను అంతే...

సరేలేద్దూ యదవ నూసెన్సూ...!!

ఈ రోజు బాపూ గారి ముత్యాలముగ్గు సినిమా చూశా !!

అది చూడగానే అందులో రావుగోపాలరావు గారి అదరగొట్టే డైలాగులు ఇక్కడ పెట్టాలి అనిపించింది...




అబ్బా సెగట్రీ ఎప్పుడూ పనులూ, బిజినెస్సేనా...ఆ..!!
పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి..ఆ ప్రత్యక్ష నారాయణుడి సేవ చేసుకోవద్దూ...

సెక్రెటరి: యస్సార్ !!

యస్సార్ గాదు... కళ్ళెట్టుకు సూడు...
పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ.. ఆకాశంలో...
సూరీడు నెత్తురుగడ్డలా లేడూ...


సెక్రెటరి: అద్భుతం సార్ !!

ఆ!! మడిసన్నాక కాసింత కలాపోసనుండాలయా...
ఉత్తినే తినితొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటదీ...

సెక్రెటరి: యస్సార్ ! మీరొకసారి చూసి సరే అనేస్తే తర్వాత ఏర్పాట్లు చాలా ఉన్నాయి...

సరేలేద్దూ యదవ నూసెన్సూ...!!





సూచన :
మీరు ఈ సినిమా డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటే పైన "ముత్యాలముగ్గు" మీద క్లిక్ చేయండి !!



పుణ్యభూమి నా దేశం

భారతదేశం...
నాకు చెప్పటానికి మాటలు రావడం లేదు...

ముందు మీరు ఈ లింకు చూడండి...
మొదట్లో చిన్న ప్రకటన వస్తుంది...అది అయ్యాక అసలు డాక్యుమెంటరీ వస్తుంది... అది చూడండి...


A Billion Reasons to Care About India

http://abcnews.go.com/Video/playerIndex?id=1674437



మొత్తం చూశాక మీ కామెంట్స్ రాయండి...

నాకు మాత్రము అందులో నచ్చింది ఏంటి అంటే...
ఒక అమెరికను, ఒక షాపు వాడిని ఇంటర్వ్యూ చేస్తాడు...అప్పుడు ఆ షాపు వాడు చెప్పిన సమధానాము ఇదీ....

INDIA IS NOT BEHIND AMERICA, INDIA IS WITH AMERICA


ABCNEWS.com లో ప్రచురించిన ఈ వ్యాసము చూడండి !!

http://abcnews.go.com/GMA/International/story?id=1673685&page=1




భారతమాతకు జై జై లు !!!




ఇది నా స్నేహితుడు "విశ్వనాథ్ కలవ" తయారు చేసిన ఫ్లాష్ డాక్యుమెంట్.
అతను ఇది తయారు చేయడానికి చాల కాలం శ్రమించాడు. చాలా చోట్ల వెతికి మంచి మంచి ఛాయా చిత్రాలను సంపాదించాడు.
ఇందులో అతను రాసిన వ్యాఖ్యానాలు, చిత్రించిన చిత్రాలు నన్ను బాగా ఆకర్షించాయి.
మీరు కూడా చూసి ఆనందిస్తారు అని ఆశిస్తున్నా....
ధన్యవాదములు...
మీ రఘు !!

THE END OF THE BEGINNING !!!


ఏమయింది వీడికి.... ఇలా మాట్లాడుతున్నాడు... beginning ఏంటి... మళ్ళీ ending ఏంటి అనుకుంటున్నారా... అవునండి...నేను చెప్పింది నిజమే... నా MS కోర్స్ లో నేటితో మొదటి సెమిస్టరు పూర్తి అయింది... అందుకే ending of the beginning అన్నాను.... ఇక్కడికి వచి పట్టుమని 3 నెలలు కూడ అయినట్టు అనిపించలేదు.... అప్పుడే మొదటి సెమిస్టరు అయిపొయింది.... వచిన కొత్తల్లో ఈ రెండు ఏళ్ళు ఎలా గడపాలా అని అనుకున్న నాకు ఇప్పుడు కొంచెం ధైర్యం గా ఉంది... ఏంటి ఒక్క సెమిస్టర్ అయిపొతే ధైర్యం వచ్చేస్తుందా అనుకుంటున్నారా.... అది కాదు ఇక్కడ విషయం... ఎలా అయిపొయిందో కూడ తెలియకుండానే ఒక్క సెమిస్టర్ అయిపోయింది... అలాంటిది మిగిలిన సెమిస్టర్లు అవడం పెద్ద విషయం కాదేమో అనిపిస్తోంది...

ఏమంటారు ???

పరాకాష్టకు చేరిన remix పిచ్చి...

remix - ఈ మాట ఈ మధ్య కాలంలో చాలా సార్లే వింటున్నాము...

పాత బ్లాక్ & వైట్ పాటల్ని తీసుకుని, నేటి తరపు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి కొంచెం కొత్తదం రంగరించడాన్ని ముద్దుగా remix అని పిలుచుకుంటారు....

ఐతే.. మరి పాత పాటలు అయిపోయాయో, లేక పాతలో కొత్తదనం కోసమో తెలీదు కానీ ఈ మధ్య ఈ remixకి కొన్ని మార్పులు చేసుకుంటున్నాయి....

సంగీత దర్శకులకు బాణీలు దొరకక ఇలా చేస్తున్నారో, లెక పాటల రచయితలకు మాటలు దొరకక ఇలా చేస్తున్నారో తెలీదు కానీ, ఈ మధ్య వచ్చిన ఒక సినిమాలో సుప్రభాతాన్ని అత్యంత దారుణంగా ఖూనీ చెయడం జరిగింది....

బాలకృష్ణ నటించిన "మహారథి" అనే సినిమాలో మనం ఎంతో పవిత్రంగా భావించే శ్రీ వెంకటేశ్వరస్వామి సుప్రభాతాన్ని అందులో ఒక పాటలో వాడటం జరిగింది...

నా మట్టుకు నాకు ఆ పాట వింటుంటే ఒంటిమీద తేళ్ళు జెర్రులు పాకినట్టు అనిపించింది...
మా roommates కి వార్నింగ్ ఇచ్చేసా, నేను ఉన్నప్పుడు గనుక ఆ పాట పెడితే చచ్చారే అని...

ఇది ఇలాగే గనుక కొనసాగితే, ముందు ముందు మన అష్టోత్తరాలు, సహస్రనామాలు వంటి వాటిని మనం remix versions లోనే వినాల్సి వస్తుందేమో....

భగవంతుడా, దయ చేసి ఆ రోజు మాత్రం రానివ్వకు !!!

బుల్లి పెట్టెలో ప్రకృతి అందాలు....

నేను ఈ రోజు మా ఫ్రెండ్స్ తో కలిసి ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక చైనీస్ రెస్టారంట్ కి వెళ్ళాను...

వెళ్ళే దారిలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రకృతి అందాలు చూస్తే ఒళ్ళు పులకరించింది.....

వాటిలో కొన్నిటిని నా కెమెరా లో బంధించాను....











హృదయం కదిలించిన పాట....ఇది విని నా కళ్ళు చెమ్మగిల్లాయి...

భూలోక స్వర్గమంటూ ఈ దేశం ఎగిరొచ్చావా !!
పోలేక ఉండలేక కంటి నీడై నిలిచావా !!
ఎన్నెన్నో ఆశలతోటి దేశం దాటి వచ్చావా !!
అడుగడుగున బాధలతోటి బ్రతుకే పోటీ ఇచ్చావా !!
కన్నతల్లి చేతిముద్ద నేలపాలే చేసావా !!
అమ్మ కన్న మిన్న లేదు అన్న మాటే మరిచావా !!


చదువులకే చదువై నిలిచీ...
అమ్మ కంటి వెలుగై మెరిసీ...
పౌండుల్లో పవరే చూసీ...
లండన్ నీ నవ్వే చేసీ...
కన్నోళ్ళ తోడే విడిచీ...
కని పెంచిన ఊరే విడిచీ...
నేస్తాలా స్నేహం విడిచీ...
నీ మట్టికి దూరం నడిచీ...
పై చదువుల కోసం నువ్వు పయనం అయ్యీ వచ్చావా...
నీ మేధకు సమాధి కట్టే మోసానికి బలి అయ్యావా...
ప్రాణమల్లే ఉన్న చదువునీ పార్ట్ టైముగా మార్చావా...
బాధల్లో ఉన్నా గానీ బాగున్నానని అన్నావా...

అవకాశాలెన్నో ఉన్నా...
నీ కోసం చూస్తూ ఉన్నా...
అందనిదే గొప్పని నమ్మీ...
ఆస్తిపాస్తులన్నీ అమ్మి...
ఊహల్లో మేడలు కట్టీ...
ఫారిన్లో అడుగే పెట్టీ...
పరువంతా పక్కన పెట్టీ...
కూలీల వేషం కట్టీ...
అవమానాలెన్నో మోస్తూ అన్నీ చేస్తూ ఉన్నావా...
జీవితమే జీతం తోటి తూకం వేస్తూ ఉన్నావా...
ఎండమావి నీళ్ళ కోసం ఎడారిలోనా వెతికావా...
ముళ్ళదారిలోన నువ్వు గాయమయ్యీ నిలిచావా...

రక్తాన్నే పంచిన తల్లీ...
రాఖీని కట్టిన చెల్లీ...
నువ్వాడీ పాడిన గల్లీ...
చూస్తున్నవి నీకై మళ్ళీ...
ఎదిగొచ్చిన బిడ్డల కోసం...
ఎరలిచ్చె ఆప్తుల కోసం...
గూడొదిలిన గువ్వల కోసం...
గుర్తొచ్చే నవ్వుల కోసం...
చూస్తున్నది గగనం నిండా ఎగిరే జెండా రమ్మంటూ...
వీస్తున్నది దేశపు గాలీ ఝండా ఊంచా అనమంటూ...
ఓ సచినూ కలాము కూడా ఫారిను పౌండే దిక్కనుకుంటే...
ఈ ఎత్తుకు ఎదిగే వారా దేశం ఖ్యాతిని పెంచేవారా...
నిజం తెలుసుకో నీ రుణం తీర్చుకో...
భారతీయుడై భువిని గెల్చుకో....

వందెమాతరం...
వందెమాతరం...
వందెమాతరం...
వందెమాతరం...
వందెమాతరం...
వందెమాతరం...
వందెమాతరం...
వందెమాతరం...
వందెమాతరం...
వందెమాతరం...
వందెమాతరం...
వందెమాతరం...
వందెమాతరం...
వందెమాతరం...
వందెమాతరం...
వందెమాతరం...

new photos


















ఓ !! ఈ రోజు పండుగా ???

ఎంటి వీడికి ఎమైంది ఇలా అడుగుతున్నాడు అనుకుంటున్నారా ???

ఇక్కడికి (US) వచ్చాక పరిస్థితి అలాగే మారింది !!!

పడమటి సంధ్యారాగం సినిమాలో చూసి ఏదో అనుకున్నా, మరీ అలా ఉంటామా ? ఇంట్లో వాళ్ళతో ఫోనులో మాట్లాడుతూనే ఉంటాము కదా, ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా అని....

పండగ ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది, కానీ పండగ చేసేది ఎవరు ఇక్కడ ???

పండగ చేయడం అనగానే పోకిరి సినిమాలో బ్రహ్మానందం గుర్తుకువస్తున్నడేమో...

ఇంతకీ ఎంటిరా వీడి బాధ అనుకుంటున్నారు కదా ????

ఏమి చెప్పను ? నా బాధ ఎంటో నాకే తెలియడం లేదు...

దీపావళి.....

ఇంటి దగ్గర ఉంటే ఎంత బాగా చేసుకునే వాళ్ళం ??

పొద్దున్నే తలారా స్నానాలు లేవు, అమ్మ వండిన పిండి వంటలు లేవు, పూజలు పునస్కారాలు లేవు, దీపాలు లేవు, టపాసులు లేవు, మిఠాయిలు లేవు, ఆటలు లేవు, పాటలు లేవు, అక్కలు లేరు, అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, చెల్లెళ్ళు లేరు, అసలు ఎవరు ఉన్నారు ?? ఎవరూ లేరు ..

ఒక్కటి మాత్రం ఉంది...... అదే $$ మీద మోజు....

కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోక తప్పదు అని పెద్దలు ఎప్పుడో అన్నారు కదా...

ఇది కూడా దాని కిందకే వస్తుందేమో....

ఎమి చేస్తాం ???

జీవితం ఇంతే....

New photos