తిండి తిప్పలు !!!

ఈ రోజు నాకు కొత్త అనుభవం ఎదురయ్యింది !!
సరదాగా కూడా ఉంది !!

ఈ రోజు రూంలో ఒక్కడినే ఉన్నాను ! అందుకని అన్నము వండుకోడానికి బద్దకం వేసి, సరదా(తీరే దాకా)గా బయట తిందామని అనుకున్నా !!

వెంటనే బయలుదేరాను !!

రోడ్డు మీదకి వెళ్ళాను, దగ్గర్లో ఒక్క రెస్టారెంటు కూడా లేదు.... కొంత దూరం నడవగానే "DOMINOS PIZAA" కనిపించింది !!
లోపలికి వెళ్ళీ "May I have a thin crust, single topping, medium sized Jalapènos Pizaa please !!" అని ఏదో పద్యం అప్పచెప్పినట్టు ఫాస్టు గా చదివేశా (మన ఎంగిలిపీసు ప్రావీణ్యం చూపిద్దామని) !!

కష్టపడి అంత ఫాస్టుగా చెప్పాకా, అక్కడ ఉన్న అమ్మాయి , "I am sorry !! Pardon me, I didnot understand wat u said !" అంది !!

నా తల్లే ! ఎమీ అర్ధం కాలేదా ! అనుకున్నా మనసులో...
ఇందాక చెప్పినదే మళ్ళీ , ఒక్కో పదం విడమర్చి, వివరించి చెప్పాను !!

అర్డరు చేయడం అయిపోయింది !! కానీ నేను అక్కడ గమనించింది ఏంటి అంటే, పిజ్జాని ఇంటికి తీసుకుపోయి తినాలి, అక్కడ కూర్చుని తినడానికి వీలు లేదు !
ఓరి భగవంతుడా ! మళ్ళీ ఇంటి దాకా నడుచుకుంటూ వెళ్ళాలా.... నాకు అంత ఓపిక లేదు....
ఇక్కడే ఏ చెట్టు కిందన్నా కూర్చుని తిందాములే అనుకుని పిజ్జా తీసుకుని బయటకు వచ్చాను !!

బయటకు రాగానే మంచి ఆలోచన వచ్చింది !!
పక్క రెస్టారెంటులో ఖాళీగా కుర్చీలూ బల్లలూ కనిపిస్తున్నాయి , అక్కడికి వెళ్ళి కూర్చుని తింటే పోతుంది కదా అని !!

భలే ఉంది కదా ఆలోచన !!

కాని అక్కడెక్కడో కొనుక్కుని వచ్చి, వాడి టేబుల్ మీద కూర్చుని తింటే , ఆ రెస్టారెంటు వాడు ఎందుకు ఒప్పుకుంటాడు ?
అందుకని అక్కడ ఎమన్నా కొంటే అదీ ఇదీ రెండూ కలిపి అక్కడే తినచ్చు కదా అనుకున్నా... !!
కానీ ఏమి తినాలి ?
నేను బయటకు వస్తే తినేవి, పిజ్జా, Potato Fries (I am a vegetarian)!!
కాబట్టి అదే తినాలి !
నాకు అక్కడ కనిపించిన రెస్టారెంటు పేరు "WAFFLE HOUSE"...
అక్కడికి వెళ్ళి అడిగాను.... "May I have small sized french fries please" అని !!
అక్కడ ఉన్న అమ్మాయి "what sis u say ?" అంది !!
ఈ సారి నేను ఏమి అంత ఫాస్టుగా చెప్పలేదే....
మళ్ళీ మళ్ళీ చెప్పాను "french fires", "potato fries" అని...
అక్కడ అలాంటివి ఏమి లేవు అని చెప్పి , ఒక ఉచిత సలహా పడేసింది నాకు !!
"They will be available in the Chinese restaurant" అని పక్కనే ఉన్న ఒక చైనీసు రెస్టారెంటు చూపించింది !!

నాకు అప్పటికీ అనుమానం గానే ఉంది..
"Chinese restaurant" లో "French fries" ఏంటా అని!!
సరే ఒక రాయి వేస్తేపోలా అని వెళ్ళాను !!
అక్కడికి వెళ్ళి అదే అడిగాను !!
అక్కడ ఉన్న అమ్మాయికి ఇంగ్లీషు రాదు , నాకు చైనీసు రాదు !!
ఇంక చూడాలి మా ఫార్సు !!

మొత్తానికి అక్కడ అలాంటివి ఏమీ లేవు అని అర్థమ అయిపోయింది !!

మొహము మీద రాని నవ్వు ఒకటి తెప్పించుకుని "OK ! Thank you ! Have a nice day !" అని చెప్పి బయట పడ్డాను !!

తలుపు తీసిన వెంటనే , ఎడారిలో ఎండమావిలాగా, కళ్ళముందు "McDonald's Restaurant" !!
అది French fries కి పెట్టింది పేరు !!
వెళ్ళి చిన్న french fries ఒక చిన్న sprite ఆర్డరు చేసాను !!
ఆర్డరు చెప్తున్నంతసేపూ ఆ కౌంటరులో ఉన్న అమ్మాయి చూపు నా చేతిలో ఉన్న పిజ్జా మీదే !!

మొత్తానికి ఆర్డరు వచ్చింది !!

వెళ్ళి కూర్చుని పిజ్జా పార్సెలు తెరిచి లాగిస్తున్నా !!
అక్కడ పనిచేస్తున్న మనుషులు నన్ను వింతగా చూస్తున్నారు ! వీడికి ఈ పిజ్జా తినటానికి ఇన్కా వేరే చోటు దొరకలేద అన్నట్టూ ( అది నా Psychological feeling కూడా కావచ్చు !!)
మొత్తానికి అన్నీ లాగించేసాను !!


తాపీగా బయటకు వచ్చి... రూము వైపు ఆడుగులో అడుగు వేస్తూ నడవసగాను !!

అమెరికా వచ్చి నాలుగు నెలలు ఉండి అలవాటు పడిన నాకే ఇంత కష్టంగా ఉంటే ! అప్పుడె ఫ్లైటు దిగిన వాళ్ళ పరీస్థితి ఏంటి ??
(కొంచెము ఎక్కువైంది కదా !!)