సరేలేద్దూ యదవ నూసెన్సూ...!!

ఈ రోజు బాపూ గారి ముత్యాలముగ్గు సినిమా చూశా !!

అది చూడగానే అందులో రావుగోపాలరావు గారి అదరగొట్టే డైలాగులు ఇక్కడ పెట్టాలి అనిపించింది...




అబ్బా సెగట్రీ ఎప్పుడూ పనులూ, బిజినెస్సేనా...ఆ..!!
పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి..ఆ ప్రత్యక్ష నారాయణుడి సేవ చేసుకోవద్దూ...

సెక్రెటరి: యస్సార్ !!

యస్సార్ గాదు... కళ్ళెట్టుకు సూడు...
పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ.. ఆకాశంలో...
సూరీడు నెత్తురుగడ్డలా లేడూ...


సెక్రెటరి: అద్భుతం సార్ !!

ఆ!! మడిసన్నాక కాసింత కలాపోసనుండాలయా...
ఉత్తినే తినితొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటదీ...

సెక్రెటరి: యస్సార్ ! మీరొకసారి చూసి సరే అనేస్తే తర్వాత ఏర్పాట్లు చాలా ఉన్నాయి...

సరేలేద్దూ యదవ నూసెన్సూ...!!





సూచన :
మీరు ఈ సినిమా డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటే పైన "ముత్యాలముగ్గు" మీద క్లిక్ చేయండి !!



3 comments:

Anonymous said...

నేనింత వరకూ ఆ చిత్రం గురించి విన్నాను కానీ, చూసే అవకాశం రాలేదు.

మీరింత మర్యాదగా
"ఆ!! మడిసన్నాక కాసింత కలాపోసనుండాలయా...
ఉత్తినే తినితొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటదీ.. " అని, డౌన్ లోడు లింకు కూడా చూపించిన తర్వాత చూడకుండా ఎలా ఉంటాను.చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుతాను.

రాధిక said...

అప్పటికి ఇప్పటికి సూపర్ హిట్ డైలాగ్ ఇది.రావు గోపాలరావు గారి కంఠం నుండి వచ్చిందేమో...తెలుగు ప్రజలు మనసుల్లో ముద్రించేసుకున్నరు.

చదువరి said...

తెలుగు సినిమా విలనుకు ఒక హోదా, విలువా తెచ్చిన సినిమా ఇది. ఆ మేనరిజముతో రావుగోపాలరావు తనకో స్థాయిని కల్పించుకున్నాడు. రాసిన, తీసిన, చేసిన ముగ్గురూ ఈ పాత్రను, సినిమాను చిరస్మరణీయం చేసారు.

తెలుగువారి ఉమ్మడి ఆస్తి ఆ సినిమా! "ఏదొ, ఏదో అన్నది ఈ మసక వెలుతురు..", "ఎంతటి రసికుడవో తెలిసెరా.." అల్లు రామలింగయ్య, సంగీత, మాడా, నూతన్‌ప్రసాదు, కోతి, హలం.. ఇలా ఒకటా, రెండా.. ఒక్కరా, ఇద్దరా - అందరూ హీరోలే అందులో. ఆ సినిమాతో బాపూరమణలు తెలుగువాళ్ళను మరోసారి తమకు ఋణగ్రస్తుల్ని చేసుకున్నారు.