పరాకాష్టకు చేరిన remix పిచ్చి...
remix - ఈ మాట ఈ మధ్య కాలంలో చాలా సార్లే వింటున్నాము...
పాత బ్లాక్ & వైట్ పాటల్ని తీసుకుని, నేటి తరపు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి కొంచెం కొత్తదం రంగరించడాన్ని ముద్దుగా remix అని పిలుచుకుంటారు....
ఐతే.. మరి పాత పాటలు అయిపోయాయో, లేక పాతలో కొత్తదనం కోసమో తెలీదు కానీ ఈ మధ్య ఈ remixకి కొన్ని మార్పులు చేసుకుంటున్నాయి....
సంగీత దర్శకులకు బాణీలు దొరకక ఇలా చేస్తున్నారో, లెక పాటల రచయితలకు మాటలు దొరకక ఇలా చేస్తున్నారో తెలీదు కానీ, ఈ మధ్య వచ్చిన ఒక సినిమాలో సుప్రభాతాన్ని అత్యంత దారుణంగా ఖూనీ చెయడం జరిగింది....
బాలకృష్ణ నటించిన "మహారథి" అనే సినిమాలో మనం ఎంతో పవిత్రంగా భావించే శ్రీ వెంకటేశ్వరస్వామి సుప్రభాతాన్ని అందులో ఒక పాటలో వాడటం జరిగింది...
నా మట్టుకు నాకు ఆ పాట వింటుంటే ఒంటిమీద తేళ్ళు జెర్రులు పాకినట్టు అనిపించింది...
మా roommates కి వార్నింగ్ ఇచ్చేసా, నేను ఉన్నప్పుడు గనుక ఆ పాట పెడితే చచ్చారే అని...
ఇది ఇలాగే గనుక కొనసాగితే, ముందు ముందు మన అష్టోత్తరాలు, సహస్రనామాలు వంటి వాటిని మనం remix versions లోనే వినాల్సి వస్తుందేమో....
భగవంతుడా, దయ చేసి ఆ రోజు మాత్రం రానివ్వకు !!!
2 comments:
బాబూ రఘురాం, నీ భాధ పూర్తిగా అర్థం చేసుకోగలను. ఈ దరిద్రం మన సొంతం కాదు. 'ఖుషీ' అనే కన్నడ సినిమా నుంచీ దించేసారు. సంగీత దర్శకుడూ ఒకరే అనుకొంటా..'గురు కిరణ్'
నవీన్ గార్ల
http://gsnaveen.wordpress.com
ఏఁవిటోనయ్యా రఘురామా! కలికాలమంటే మరో ఎనిమిదివేల ఏళ్ళుందన్నారు అప్పట్లో... మరీ ఎనిమిదివేలు అంటే ఇలా ఏడెనిమిదేళ్ళలో అయిపోతాయనుకోలేదు సుమీ! ...ఇంతకీ, మరో మాటోయ్... అది సుప్రభాతం కాదు నాయనా, శ్రీవేంకటేశ్వర స్తోత్రం, అంతే! ఏదైనా ఖూనీకి అర్హం కాదనుకో... ఐనా నేను పూర్తిగా ఖండించను దీనిని ఇప్పుడే... సినిమా రానివ్వు... తెర మీద బొమ్మలో మరి ఈ స్తోత్రభాగానికి, తక్కిన పాటకి సంబంధం లేదేమో!
"రేపల్లెలో రాధ" అన్న చిత్రంలో "సరసం విరసం జతలో సహజం" అని లైన్ లెన్త్ సరిపోయిన పాపానికి అక్కడ "అవనీతనయా కమనీయకరం..." అని అందుకున్నారు "పుంభావసరస్వతి" అని కొనియాడబడే ఒకానొక ద్విభాషాపండితుడైన గీత రచయిత గారు, రెండూ ఒకే ఛందస్సులో ఉండటమే పాపమేమో అనిపించేట్టు! (మధురాష్టకము, శ్రీవేనక్టేశ్వర స్తోత్రమూ, ఆ సదరు గీతము తోటక వృత్తంలో వ్రాయబడినవి... ఆయనకి ఇదో రకం పైత్యం, అనకూడదేమో కానీ... లెన్త్ సరిపోయిందని ఆయన మరోసారి "రామునితోకపివ" అని కూడా వ్రాసారు, సరిపోని చోట "అవకతవకడు" వంటి పదాలూ సృష్టించారు!
...నేను సైతం :-(
Post a Comment