మహాప్రస్థానం





శ్రీశ్రీ గారు రాసిన "మహాప్రస్థానం"ని నా బ్లాగ్ లో పెట్టడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను....

నాకు ఈ ఆలోచన రావడానికి ముఖ్య కారణం కిరణ్ చక్రవర్తుల గారు (మేము ముద్దుగా కె.సి. అని పిలుచుకుంటాము)....

నాకు ఈ పుస్తకం ఇచింది ఆయనే...

ఆయన మీకు సుపరిచితులే....

నాకు అసలు బ్లాగ్ రాసే ఆలోచన కల్పించింది ఆయనే....

నా ఈ చిన్ని ప్రయత్నంలో ఎమైనా తప్పులు ఉంటే క్షమించండి !!!

మహాప్రస్థానం - జగన్నాధ రధచక్రాలు

పతితులార !
భ్రష్టులార !
బాధాసర్ప దష్టులార !
బ్రదుకు కాలి,
పనికిమాలి,
శనిదేవత రధచక్రపుతిరుసులలో పడి నలిగిన
దీనులార !
హీనులార !
కూదు లేని, గూదు లేని
పక్షులార ! భిక్షులార !
సఖులవలన పరిచ్యుతులు,
జనులవలన తిరస్కృతులు,
సంఘానికి బహిష్కృతులు -
జితాసువులు,
చ్యుతాశయులు,
హృతాశ్రయులు,
హతాశులై,
ఏడవకండేడవకండి !

మీ రక్తం కలగి కలగి,
మీ నాడులు కదలి కదలి,
మీ ప్రేవులు కనలి కనలి,
ఏడవకండేవకండి !
ఓ వ్యధానివిష్టులార !
ఓ కధావశిష్టులార !
పతితులార !
భ్రష్టులార !
బాధాసర్పదష్టులార !
ఎడవకండేవకండి !

వస్తున్నాయొస్తున్నాయి...
జగన్నాధ,
జగన్నాధ,
జగన్నాధ రధచక్రాల్,
జగన్నాధుని రధచక్రాల్,
రధచక్రాల్,
రధచక్రాల్,
రధచక్రాల్,రధచక్రాలోస్తున్నాయి !

పతితులార !
భ్రష్టులార !
మొయిల్దారిని
బయల్దేరిన
రధచక్రాల్, రధచక్రాలొస్తున్నాయొస్తున్నాయి !

సిమ్హాచలం కదిలింది,
హిమాలయం కరిగింది,
వింధ్యాచలం పగిలింది -
సిమ్హాచలం, హిమాచలం
వింధ్యాచలం, సంధ్యాచలం...
మహానగరాలెగురుతున్నాయి !
మహారథం కదులుతున్నాఆది !
చూర్ణమాన
ఝూర్ణమాన
దీర్ణమాన గిరిశిఖరాల్
గిరగిరగిర తిరుగుతున్నాయి !
పతితులార !
భ్రష్టులార !
బధాసర్ప దష్టులార !
రారండో ! రండో ! రండి !

ఊరవతల నీరింకిన
చెరువు పక్క, చెట్టు నీడ -
గోనెలతో, కుండలతో,
ఎటు చూస్తే అటు చీకటి,
అటు దు:ఖం, పటు నిరాశ -
చెరసాలలు, ఉరికొయ్యలు,
కాలువలో ఆత్మహత్య !
దగాపడిన తమ్ములార !
మీ బాధలు నేనెరుగుదును...
వడలో, కడు
జడిలో, పెను
చలిలో తెగనవసికుములు
మీ బాధలు, మీ గాధలు,
అవగాహన నాకవుతాయి !
పతితులార !
భ్రష్టులార !
దగాపడిన తమ్ములార !
మీ కోసం కలం పట్టి,
ఆకాశపు దారులంట
అడావుడిగ వెళిపొయే,
అరచుకుంటూ వెళిపోయే
జగన్నాధుని రథచక్రాల్,
రథచక్ర ప్రళయఘోష
భూమార్గం పట్టిస్తాను,
భూకంపం పుట్టిస్తాను !

నట ధూర్జటి
నిటాలాషి పగిలిందట !
నిటాలాగ్ని రగిలిందట !
నిటాలాగ్ని !
నిటాలార్చి !
నిటాలాషి పటాలుమని,
ప్రపంచాన్ని భయపెట్టింది !

అరె ఝూc ! ఝూc !
ఝటక్, ఫటక్...
హింసనచణ
ధ్వంసరచన,
ధ్వంసనచణ
హింసరచన !
విషవాయువు, మరఫిరంగి,
టార్పీడో, టోర్నాడో,
అది విలయం,
అది సమరం,
అటో ఇటో తెగిపోతుంది

సమ్రంభం,
సంక్షోభం,
సమ్మర్దన, సంఘర్షణ
హలాహలం పొగచూరింది !
కోలాహలం చెలరేగింది !
పతితులార !
భ్రష్టులార !
ఇది సవనం,
ఇది సమరం !
ఈ ఎగిరిన ఇనుపడేగ,
ఈ పండిన మంట పంట -
ద్రోహాలను తూలగొట్టి,
దోషాలను తుడిచిపెట్టి,
స్వాతంత్ర్య్మ్,
సమభావం,
సౌభ్రాత్రం,
సౌహార్దం
పునాదులై ఇళ్ళు లేచి,
జణావళికి శుభం పూచి -
శాంతి, శాంతి, కాంతి, శాంతి
జగమంతా జయిస్తుంది !
ఈ స్వప్నం నిజమవుతుంది !
ఈ స్వర్గం ఋజువవుతుంది !
పతితులార !
భ్రష్టులార !
బధాసర్ప దష్టులార !
దగాపడిన తమ్ములార !
ఏడవకండేవకండి !
వచ్చెశాయ్, విచ్చేశాయ్ !
జగన్నాథ,
జగన్నాథ,
జగన్నాథ రథచక్రాల్,
జగన్నాథుని రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్, రథచక్రాల్,
రారందో ! రండో ! రండి !
ఈ లోకం మీదేనండి !
మీ రాజ్యం మీరేలండి !