నేను అమెరికాలో ఉన్నానండోయ్ !!!

చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగుతున్నా !

అమెరికా వచ్చిన కొత్తల్లో బాగా ఖాళీ ఉండేది...అప్పుదు అనుకునే వాడిని, నేను ఎప్పుడు చూసినా ఇంత ఖాళీగా ఉంటున్నా, మరి అందరూ "బిజీ బిజీ లైఫ్. తినడానికి కూడా టైం ఉండదు, రెండు మూడు రోజులకొకసారి వండుకుని, దాచుకుని మరీ తింటూ ఉంటాం, స్నానానికి కూడా టైం ఉండదు" అని అంటూ ఉంటారేంటబ్బా అని ఒక ధర్మసందేహం వస్తూ ఉండేది !

కాని ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే తయారు అయింది !!

ఆఖరికి ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడటానికి సమయం కేటాయించలేకపోతున్నా !

ఇంక బ్లాగడం అంటారా అది సరేసరి !

ఆ మధ్య రానారే గారు అడుగుతున్నారు, ఏంటి ఈ మధ్య సందడి చేయడం లేదు అని,
"Im living the life of an indian student in US" అని సమాధానం చెప్పాను !

అమెరికా వచ్చి సంవత్సరం కావస్తోంది ! సగం చదువు అయింది !

ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా, "ఎప్పుడొస్తున్నావయ్యా ?" అని పలికే నాన్న గంభీర స్వరం.... "నిన్ను చూడాలనుంది నాని" అని పలికే అమ్మ కమ్మని మాటలు విన్నప్పుడల్లా, దేవుడు మనిషికి రెక్కలు ఎందుకివ్వలేదా అని అనిపించేది.... చక్కగా ఇక్కడ ఎగిరి అక్కడ వాలి అందరినీ ఒకసారి చూసి వచ్చేయచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది !

మళ్ళీ నా గొంతులో బాధ కనిపిస్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని, కొంచెం స్వరం పెంచి, "ఇంకెంతమ్మా ఒక ఏడదేగా" అని చెప్తూ ఉంటా !

ఇంకా మీతో పంచుకోవడనికి నా మదిలో చాలా మాటలున్నాయి...

మళ్ళీ ఇలాగే సమయం దొరికినప్పుడు మిమ్మల్ని పలకరిస్తా !!


అంత వరకూ సెలవు !

మీ రఘు !

4 comments:

spandana said...

పాపం మీకిప్పుడే ఖాళీ లేకుంటే ఇక పెళ్ళయి, పిల్లలు పుట్టి .... అయిపోయారు! :)

-- ప్రసాద్
http://blog.charasala.com

Raghu said...

అమ్మో ! తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది ప్రసాద్ గారు ! ఎమన్నా చిట్కా చెప్పరూ ???

Anonymous said...

మీ బ్లాగును జల్లెడలో కలపడం జరిగినది.

Madhavi said...

raghu garu...meeru rasea vidhaanamu chaala bagundi...very nice
www.maavantalu.com
www.stotralu.com