గురుదేవోభవా !





"గురుదేవోభవా !" అన్న మాటకు ఏనాడో నూకలు చెల్లిపోయినట్టున్నాయి !

ఈ వార్త చూస్తే నేటి తరంలో గురువుకి శిష్యులుస్తున్న విలువ అర్థమవుతోంది !

ఆ వార్తను ఇక్కడ చదవండి !

ఒక మనిషి విజ్ఞాన వికాసంలో తల్లిదండ్రుల తర్వాత ముఖ్యపాత్ర వహించే గురువుని నగ్నంగా చిత్రీకరించి డబ్బుల కోసం వేధించిన ఆ విధ్యార్థులని వరసగా నిల్చోపెట్టి కాల్చిపారేయడమో, నరికిపారేయడమో చెయ్యాలన్నంత కోపంగా ఉంది !

3 comments:

విహారి(KBL) said...

అవునండి పొద్దున్న పేపర్లొ చూసాను.చాలా బాధ వేసింది.అసలు మనుషులు ఎలా తయారవుతున్నరొ తెలియటం లేదు.ఇంకొ వార్త సెలవుకోసం తోటి స్నేహితులు ఇద్దరిని చంపేసారు 10,12 సంవత్సరాల పిల్లలు.ఇంకా ఎన్ని చూడాలొ.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఎవరు ఎవరికి గురువు ? ఎవరు ఎవరిని గౌరవించాలి ? గురువు గొప్పేంటి ? ఆ మాటకొస్తే అమ్మానాన్న గొప్ప మాత్రం ఏంటి ? దేన్ని తప్పుపట్టాలి ? దేన్ని పట్టకూడదు ? ఏమో...

ఈ విలువలన్నీ మనం ఎప్పుడో దులుపుకున్నాం. దులుపుకోవాలని ఇల్లెక్కి అరుస్తున్నాం కూడా ! ఈ అరుపులకు అనేక అభ్యుదయ లేబుళ్ళున్నాయి. కొన్ని పోవాలి, కొన్ని మాత్రం ఉండాలి అంటే కుదరదు. పోతే అన్నీ ఒకేసారి పోతాయి, ఉంటే అన్నీ ఉంటాయి. పోతే పోనీ...పోతే పోనీ...

These are all one of a piece. Various manifestations of the same cultural degeneration.

రాధిక said...

ఇది దేనికి పరాకాష్ట.పిచ్చితనానికా?విచ్చలవిడి తనానికా? ఇంకా దేనికన్నానా?