కోటి రూపాయలు !!
చికాగో లోని వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఒక ప్రవాస భారతీయుడు కోటి రూపాయలు ఖర్చుపెట్టి కిరీటం చేయిస్తున్నాడట !!
ఇదిగో ఆ వార్తని ఇక్కడ చూడండి !!
అసలు విషయానికి వస్తున్నా !!
ముందు ఇది చదవగానే నాకు అనిపించింది ఏంటి అంటే, ఆ కిరీటానికి ఖర్చు పెట్టే డబ్బుల్లో సగమైనా చారిటీ కింద ఏ పేద వాళ్ళకో దానము చెయ్యచ్చు కదా అని !!
కాకపోతే ఆయన అలాంటి చారిటీ పనులు కూడా చేస్తున్నాడో లేదో నాకు తెలీదు... ఏదో మనసుకి అనిపించింది ఇక్కడ రశాను అంతే...
4 comments:
నేనూ అదే అంటాను. ఇప్పుడు దేవాలయాలకేమీ కొదువ లేదు. శ్రీవారికి వున్న ఆభరణాలు చాలదనీ మళ్ళీ మళ్ళీ చేయించేబదులు సహాయ కార్యక్రమాలు చేయొచ్చు ఇప్పటికే చేస్తున్నా ఇంకా చేయొచ్చు.
--ప్రసాద్
http://blog.charasala.com
ఆ సంపాదించిన వ్యక్తి ఇష్టం. చెప్పడానికి మనమెవరిమి? ఆయన అంత డబ్బు సంపాదించాడంటే అదే చారిటీ. డబ్బు సంపాదించడమేంటి? చారిటీ ఏంటి అంటారా? మరి ఉదాహరణకి నారాయణమూర్తిని తీసుకోండి ఉద్యోగం వదిలి పెట్టుబడి పెట్టి రిస్కు తీసుకొని, రాత్రింబవళ్లు కష్టపడి ఇంఫోసిస్ ను అభివృద్ధి చేయబట్టే కదా ఇప్పుడు వేలమందికి ఉద్యోగాలు ఇవ్వగలుగు తున్నాడు. అలాంటి వాళ్లను తిరిగి సంపాదించిన దానితో ఇది చెయ్యండి అది చెయ్యండి అని చెప్పడానికి మనం అర్హులమా?
meeru annadi nijame !!
sampadinchinadi karchupettevadi ishtam....
kanee kasta upayogapade panulu cheyyachi kada !!
manava sea ey madhava seva annaru kada !!
(ala ani nenu edo nastikudini kadandee !! nenoo devudini nammutanu !! kanee ila koti ruppayilu karchu chese anta kadu)
నేనూ మీ వాదన కాదనట్లేదు. అందరూ ప్రపంచాన్ని తీర్చిదిద్దడానికి ఒక చెయ్యి వెయ్యాలని బలంగా నమ్మే వాన్నే కాకపోతే కోటి రూపాయలు ఇచ్చేంత సంపాదించాడంటే ఆయన ఈ పాటికే ఎన్నొ కోట్లకు తగిన సహాయము ప్రత్యక్షముగా, పరోక్షముగా చేసే ఉంటాడన్న పాయింటు మరచిపోకూడదని చెబుతున్నానంతే.
Post a Comment